సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం ..!

Dewald Brevis
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు తరపున అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు 125 నాటౌట్ కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. మొత్తం నలబై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల వర్షం కురిపించాడు.
గతంలో డుప్లెసిస్ 119పరుగులను సాధించాడు. ఆసీస్ పై ఫాస్టెస్ట్ శతకం నలబై ఒక్క బంతుల్లో సౌతాఫ్రికా జట్టు తరపున కొట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా కూడా చరిత్రకెక్కాడు. అంతకుముందు టీమిండియా మాజీ సంచలనం విరాట్ కోహ్లీ యాబై రెండు బంతుల పేరిట ఉంది. కాగా బ్రెవిస్ డెవాల్డ్ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.