వినేశ్ పొగట్ కు మద్ధతుగా గంగూలీ
నిర్ణిత బరువు కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కి అనర్హురాలైన భారతీయ మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ పొగట్ కు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్ధతు లభిస్తుంది..
తాజాగా ఇండియా లెజండ్రీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వినేశ్ పొగట్ కు మద్ధతుగా నిలిచారు. ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ “ఒలింపిక్స్లో పతకాన్ని పొందేందుకు వినేశ్ పొగట్ పూర్తి అర్హురాలని “దాదా అభిప్రాయపడ్డారు.
ఒలింపిక్స్ ‘రూల్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియదు కానీ ఆమె ఫైనల్సు వెళ్లారంటే కచ్చితంగా మెడల్ పొందేందుకు అర్హత సాధించినట్లే. అది ఏ పతకమైనా ఓకే.
అనర్హత సరైనదా కాదా అనేది పక్కన పెడితే, మెడల్ కు వినేశ్ పూర్తి అర్హురాలు’ అని దాదా ఈసందర్బంగా పేర్కొన్నారు. మరోవైపు వినేశ్ పొగట్ అనర్హతపై ఆర్బిట్రేషన్ కోర్టు ఈ నెల 13న తీర్పు ఇవ్వనుంది.