మోదీకి తుమ్మల కౌంటర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మోద్దు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ ” రూ.18వేల కోట్ల రుణమాఫీ బీజేపీకి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కన్పించట్లేదా..? ఆయన ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు. మాఫీ పూర్తవ్వగానే రైతు భరోసా వేస్తామని అన్నారు. తాము నిత్యం రైతుల్లో తిరుగుతున్నాము.. వ్యతిరేకత ఉంటే తమకు నిరసన సెగ తగిలేదని గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.