1,20,000మంది ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కారు వేటు తప్పదా.?

MLAs who shocked Revanth…!
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? …ప్రభుత్వ శాఖాల్లో పలు శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) తొలగింపులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? ..ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉన్నదని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా?… ఏజెన్సీల ద్వారా కార్మిక తదితర శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలి గింపులు జరుగుతున్నట్టు టాక్.
ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చినట్టు కూడా తెలిసింది.గత పదిహేను నెలల్లో రాష్ట్రంలో కొత్తగా 50 వేల కొలువుల భర్తీ ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ఫైళ్లు కదుపుతున్నట్టు తెలిసింది. జీత భత్యాల చెల్లింపుల్లో నగదు కొరతను నివారించేందుకు వీలైనంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా తొలిగిం చాలని నిర్ణయించినట్టు సమాచారం. 60 ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి, వారిలో సగం మందిని తొలిగించడానికి సన్నా హాలు చేస్తున్నట్టు తెలిసింది.
పీఆర్సీ నివేదిక ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖల్లో 1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. తమ వంతు బాధ్య తగా ప్రభుత్వ పథకాల అమలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెడపై రేవంత్ సర్కార్ కక్షగట్టి తీసేస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు, ఎందుకు తీసేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వకుండా తొలిగిస్తు న్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.