తెలంగాణ గురుకులాల్లో ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

ACB Raids In Telangana Gurukula’s
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీ గురుకులాల్లో ఈరోజు ఉదయం నుండి ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే..ఈ రోజు ఉదయం నుండి వసతి గృహాల్లో నిర్వహించిన దాడుల్లో విద్యార్థుల వసతి గృహాల్లో తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు గుర్తించారు..
అంతేకాకుండా పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీయడం జరిగింది.. హాస్టల్స్‌లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది..
దీంతో విద్యార్థులకు అందించే ఆహారపదార్థాలపై చేసిన దర్యాప్తులో కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్టు గుర్తింపు.వార్డెన్లు నెలకు ఒకసారే రావడం.. కల్తీ నాణ్యతలేని ఆహార పదార్థాలను పెట్టడం లాంటి పలు విషయాలను గుర్తించినట్లు తెలుస్తుంది. ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.