కాంగ్రెస్ నేత ఇంటి పని మనిషి హత్య

5 total views , 1 views today
హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది… భార్యపై అనుమానంతో ఏకంగా మహమ్మద్ హసన్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు… అంతేకాకుండా ఆ తర్వాత తానే తన భార్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు..
ఈ క్రమంలో అనుమానం వచ్చిన అసుపత్రి భద్రతా సిబ్బంది ఆ నిందితుడిని అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు.. దీంతో మృతదేహం చెత్తకుండీలో దొరికిందని సెక్యూరిటీ సిబ్బందికి హసన్ కట్టు కథలు చెప్పాడు .
సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉస్మానియా ఆస్పత్రికి వచ్చి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్న హాసన్ .తాను కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పని చేస్తాను అని చెప్పాడు..
