కోహ్లీపై సంచలన ఆరోపణలు..!
టీమిండియా మాజీ కెప్టెన్..సీనియర్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు.. ఆయన మాట్లాడుతూ మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియడానికి కోహ్లినే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ప్లేయర్ల ఫిట్ నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు.
అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 వరల్డ్ కప్ లు గెలిపించాడు..మహమ్మారి వ్యాధి క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన యువీకి టైమ్ ఇవ్వలేదు’ విరాట్ కోహ్లీ గురించి రాబిన్ ఊతప్ప తెలిపారు.