వైసీపీకి షాక్

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదగురు వైసీపీ కార్పొరేటర్లు పలువురు నేతలు డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ”ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది..
వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు కాదు. వైసీపీ విధానాలతోనే జనసేన విభేదిస్తుంది.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నాను ..
విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.. త్వరలో విశాఖలో పర్యటిస్తాను అని “డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..
