KCR కు షాక్
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది.
గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.