కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్

Siddaramaiah Karnataka Chief minister
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు..ముడాలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సెక్షన్ 17 కింద ఆయనపై కేసు నమోదయింది.
అసలు ముడా స్కాము ఏమిటంటే మైసూర్ అభివృద్ధి కోసం ముడా భూమి సేకరించింది.. దీనికి బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఊదాహరణకు ఎకరం భూమి తీసుకుంటే అరఎకరం అభివృద్ధి చెందిన భూమిని తిరిగి ఇవ్వాలి అన్నమాట.

లేదంటే ఆర్థికంగా సాయాన్ని ఫ్యాకేజీగా ఎంచుకోవాలి. ఇందులో భాగంగా సిద్ధరామయ్య సతీమణి పార్వతి నుంచి తీసుకున్న భూమికి పద్నాలుగు సైట్లు కేటాయించడం వివాదంగా మారింది. ప్రజలకు తక్కువ డబ్బు ఇచ్చారు. కొందరికి అసలే ఇవ్వలేదు.. తక్కువ ధరకే సన్నిహితులకు భూములు అమ్మేశారని సంబంధితాధికారులపై ఆరోపణలు ఉన్నాయి.