అలాంటి ఏకైక వ్యక్తి జగన్ -షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

సింగిడి న్యూస్ -ఆంధ్రప్రదేశ్
ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆయన సోదరిమణి ..ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చిన తల్లిపై కేసు వేసిన కొడుకుగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” చెల్లెలి కూతురు..మేనకోడలి ఆస్తి కాజేసిన దొంగగా జగన్ మిగిలిపోతారు. సరస్వతి పవర్ షేర్లలో తనకు అమ్మకు వాటా ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు.
ఇప్పుడు ఒక పైసా కూడా ఇవ్వలేదు.తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లలో గిఫ్ట్ డీడ్ గా ఇచ్చాడు. తిరిగి మళ్లీ నాకు ఇవ్వమని కోర్టులో కేసు వేశాడు. జగన్ కు ఎంత విశ్వసనీయత ఉందో వైసీపీవాళ్లు ప్రశ్నించాలని ఆమె సూచించారు.
