గంభీర్ కోచ్ గా కష్టం

సహజంగా తనకే సొంతమైన ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండలేడని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు.
తనకు గంభీర్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషమేమీ లేదని శర్మ చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు..
కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్ గా ఉండలేడు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
