మిశ్రాకు షమీ కౌంటర్
తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు.
అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మహమ్మద్ షమీ అమిత్ మిశ్రా విరాట్ పై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.