ఆస్తుల్లో ఏడో స్థానం.. కేసుల్లో తొలిస్థానం..!
దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
మరోవైపు కేసుల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిస్థానంలో ఉన్నట్లు కూడా తెలిపింది.దేశంలో ఉన్న పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి…
వీటిలో సీఎం రేవంత్ రెడ్డి టాప్‌లో ఉన్నారు. రేవంత్ రెడ్డిపై హయ్యెస్ట్‌గా 89 కేసులు ఉన్నాయి.. అందులో 72 కేసులు సీరియస్ అఫెన్సెస్ కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ఆ నివేదిక తెలిపింది.