వర్రా రవీంద్ర రెడ్డి రిమాండ్ లో సంచలన విషయాలు..?
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో కోర్టు రవీంద్రరెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ కు తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.
విజయవాడ ఐకాన్ బ్రిడ్జ్ వేదికంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్లు పోస్టులు పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళే టార్గెట్ గా ఈ పోస్టుల వ్యవహారం కొనసాగింది. షర్మిల ,విజయమ్మ, సునీతలపై పోస్టులు పెట్టాలని ఆదేశాలు ఉన్నాయి.
సోషల్ మీడియా కన్వీనర్లు అవినాష్ రెడ్డి,భార్గవ్ రెడ్డి కీలకం . జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవ్ రెడ్డి బెదిరించారు. నేతలు,వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టాము. ఐపాక్ టీమ్ వాళ్లు కంటెంట్ ఇస్తే రావాలి జగన్ కావాలి జగన్ యాప్ లో అప్లోడ్ చేసాము అని విచారణలో రవీంద్రరెడ్డి వెల్లడించినట్లు తెలుస్తుంది.