తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన ప్రతి ఒక్కర్కి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడం.. మృతులకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని.. గొర్రెలు మేకలు చనిపోతే ఐదు వేలు ఇవ్వాలి..
ఆవు,గేదెలు చనిపోతే యాబై వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగెస్ ప్రజాప్రతినిధులు ప్రకటించిన సాయం బాధితులకు ఎంతగానో ఊరట నిస్తుందని కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.