టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Sensational comments of TDP leader Buddha Venkanna
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో బుద్ధా వెంకన్న పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ” ఐదేండ్ల వైసీపీ పాలనలో నాపై ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు గారింటి మీదకు దాడికెళ్తే నేను అడ్డుగా నిలబడ్డాను.. వైసీపీ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేశాను .. ఎమ్మెల్యే మంత్రులుగా ఉన్న ఎవరూ నాలెక్క పోరాటాలు చేయలేదు. నేను ఇది అసంతృప్తితో చెప్పడం లేదు..
నా ఆవేదనతో చెబుతున్నాను.. నన్ను నమ్ముకున్నవాళ్లకు కనీసం ఏ పని చేయలేకపోతున్నాను.. ఎమ్మెల్యేలు చెప్పినవాళ్లకు ప్రమోషన్లు,బదిలీలు చేస్తున్నారు.. కార్యకర్తలకు కూడా అండగా ఉండలేకపోతున్నాను. నా బాధను ఎంపీ కేశినేని చిన్ని గారికి చెప్పాను.. పార్టీ ఆధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అన్నారు అని” వ్యాఖ్యానించారు.