కేసీఆర్ పట్ల రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి అగ్రహాం..!

Opposition to KCR is not due to love for Congress!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాల్లోనే అత్యంత సీనియర్ మంత్రి.. ఎన్టీఆర్ నుండి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వరకూ తెలుగు రాష్ట్రాల అందరూ ముఖ్యమంత్రులను చూసిన సీనియర్ నేత తన అనుచరుల దగ్గర తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
గతంలో బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత దూషణలకు.. పరుష పదజాలంతో కూడిన విమర్శలకు ముందు నుండి దూరంగా ఉంటారని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు పలు పార్టీలకు చెందిన నేతలు చెబుతుంటారు. ఆయన ప్రత్యర్థులను విమర్శించే సమయంలోనూ సిద్ధాంతఫరంగా విమర్శిస్తారు తప్పా వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ ఎక్కడా చేయరు.
కానీ నిన్న రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. తెలంగాణను తెచ్చి పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి అంతటీ వ్యక్తిని మార్చూరికి పంపుతారు.. సశ్మానానికి పంపుతారు అనే ఆర్ధం వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఓ ఉన్నత బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆదర్శంగా వ్యవహరించాలి. అంతే తప్పా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం తప్పు అని వాపోయినట్లు తెలుస్తుంది.
గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుబంధు, రైతుభరోసా పథకాల అమల్లో తాను సూచిస్తున్న సలహాలను పక్కనెట్టి తనకు అన్ని తెల్సినట్లు చెప్పి నాకు ఎవరూ ఏమి చెప్పోద్దని వ్యవహారించిన రేవంత్ పట్ల అప్పట్లోనే మంత్రి తుమ్మల తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కూడా కినుకు ఉన్నట్లు తెలుస్తుంది.