కవిత కు సత్యవతి రాథోడ్ కౌంటర్

Satyavathi Rathod
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీరుతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు అవినీతి మరక అంటింది. సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఎందుకు సీబీఐ విచారణకు వెళ్లాలి. కేసీఆర్ పై సీబీఐ విచారణ జరుగుతుందంటే అప్పుడు పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌంటరిచ్చారు. మాజీ మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడుతూ ” కవిత ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హార్షనీయం. బీఆర్ఎస్ ఉంటే ఎంత. పోతే ఎంత అని అన్న నువ్వు అదే పార్టీలో ఉంటే ఎంత. పోతే ఎంత అనుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు” అని విమర్శించారు.
కవిత పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలను బాధించాయి. అందుకే పార్టీకంటే ఎవరూ ముఖ్యం కాదనే సందేశాన్ని ఇస్తూ కేసీఆర్ పార్టీనుంచి కవితను సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. ఈ గడ్డ కోసం పుట్టిన పార్టీ.. ఈ నేల ఉన్నంతవరకూ పార్టీ ఉంటుందని” ఆమె అన్నారు.