సర్ఫరాజ్ ఖాన్ శతకం
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు.
71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అదరగొడుతూ శతకం బాధేశాడు. .
ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. టెస్ట్ కెరియర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కావడం కూడా గమనార్హం. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 35, రోహిత్ శర్మ 52 ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కీలకమైన 70 పరుగులతో రాణించి ఔట్ అయ్యాడు.