దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పథకం – మంత్రి వివేక్

G. Vivekanand Minister for Labour, Employment, Training and Factories of Telangana
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA.క్లబ్ లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పదకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది.బిఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు ,ఒక డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చెయ్యలే..బీద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు.
బిఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే ఉండే తెలంగాణ సంపదను దోచుకోవడం,ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడం..కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు లో రైతుల పంటలు మునిగిపోతే గత బిఆర్ఏస్ నాయకులు ఏనాడు పట్టించుకోలే..కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ తుమ్మిడి హేట్టి నుండి కాళేశ్వరం కు ప్రాజెక్ట్ ను తరలించారు.ఫర్టీలైజర్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.అర్హులందరికీ డబుల్ బెడ్రూం,ఇందిరమ్మ ఇండ్లు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మందికి ఇండ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ప్రతి ఏటా వర్షాకాలంలో చెన్నూరు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు.
వరదల తో నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్ట పరిహారం అందిస్తాం.గత ప్రభుత్వం లో పంటలు మునిగినప్పుడు ఏ ఒక్క బి ఆర్ ఎస్ నాయకులు వెళ్ళి పంటలను చూడలేదు.పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి RFCL రీ ఓపెన్ చేయించాం.బిజెపి,BRS రెండు పార్టీలు తోడు దొంగలు.రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటు..రెండు పార్టీలు కలసి గల్లిల్లో కాదు ఢిల్లీ లో ధర్నా చేయాలి అని అన్నారు.