ఉప్పల్ లో సంజూ శాంసన్ ఊచకోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్ లో అఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పోటి పడి మరి సిక్సర్లు.. ఫోర్లతో విరుచుకుపడుతున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగులకే మొదటి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ తో సంజూ శాంసన్ పరుగుల సునామీని సృష్టిస్తున్నాడు.
మొత్తం 8ఓవర్లకు టీమిండియా 113/1 చేసింది సంజూ శాంసన్ 25 బంతుల్లో 59 (8*4, 4*6) పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మరోవైపు స్కై పద్దెనిమిది బంతుల్లో నలబై రెండు పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
