కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ అగ్రహాం..!
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై కేంద్ర మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్నారు.
‘పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది?’ అని ట్వీట్ చేశారు.