మళ్లీ వార్తల్లోకి సాయిపల్లవి

Sai Pallavi
అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? .
తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు రానున్నది..
తాను నటించిన అమరన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ బ్యూటీ ఇకపై మీడియాలో కన్పించనున్నది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానున్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీలో నటిస్తుంది.. వచ్చేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది..
