మోసానికి ప్రతిరూపం సబితా ఇంద్రారెడ్డి
మాజీ మంత్రి … మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు. తీరా నేను కాంగ్రెస్ లోకి వచ్చాను. నేను వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి మారారని మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ అన్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మోసానికి ప్రతిరూపం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలి’ అని పేర్కొన్నారు. సభలో బీఆర్ఎస్ సభ్యులకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని ఆయన తెలిపారు.