అర్హులైన రైతులకే రైతు భరోసా
అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కల్సి పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము.
ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు,ఐదోందలకే గ్యాస్ సిలిండర్,రెండోందల యూనిట్ల ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు లాంటి హామీలను అమలు చేశాము. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీకోసం ఏడు వేల కోట్లను విడుదల చేయడంతో పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది అని” పేర్కొన్నారు.
రైతుభరోసా సమీక్ష కార్యక్రమాల్లో రైతుల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నము.. రైతుల ఆకాంక్ష మేరకు రైతు భరోసా ఇస్తాము.. అర్హులైన ప్రతి ఒక్కర్కి రైతుభరోసా ఇస్తాం.. గత ప్రభుత్వం సాగుభూములు కానీవాటికి కూడా రైతుబంధు ఇచ్చింది. అలా మేము తప్పు చేయము.. రైతుభరోసాపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.