రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్పీ క్లారిటీ..!

RS Praveen Kumar
తెలంగాణలో ఈనెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం రాకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఆర్ఎస్పీ తన సోషల్ మీడియా ఆకౌంటులో క్లారిటీచ్చారు.
తన ఎఫ్బీ అకౌంటులో పోస్టు చేస్తూ ” నా రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను . ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్తు కోసం పనిచేయాల్నో నాకు క్లారిటీ ఉంది. మీ లాగా పదవులకోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి నాకు లేదు.
అన్ని పైసలు కూడా నా దగ్గర లేవు.తెలంగాణ లో తరతరాలుగా అణచివేతకు గురైన వర్గాల విముక్తి కి బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ గారు స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నాను.రేపు బీఆరెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు గార్ల ప్రోత్సాహంతో తెలంగాణ 2.0 ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నను. నన్ను డిస్ట్రబ్ చేయద్దు అని పోస్టు చేశారు..
