టీడీపీ జనసేన వాళ్లపై కేసులు పెట్టే దమ్ముందా..?- మాజీ మంత్రి రోజా
స్టార్ హీరో ప్రభాస్ ను ట్రోల్ చేస్తూ అధికార కూటమి కి చెందిన టీడీపీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్, జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు.
అల్లు అర్జున్, ఆయన కుటుంబంపై నీచంగా పోస్టులు పెడుతున్నారని, వాటిని ఆపివేయించాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.
పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించాలని అన్నారు.అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలిపెట్టబోమని రోజా హెచ్చరించారు.