రోహిత్ అసహానం..?

Rohit Sharma Indian cricketer
రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఛాంపియన్ ట్రోపీ తర్వాత హిట్ మ్యాన్ క్రికెట్ నుండి రిటైర్ అవుతారనే వార్తలు వచ్చాయి.. వీటిని ఉద్ధేశిస్తూ రిటైర్మెంట్ తర్వాత ‘మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని మీడియా ప్రశ్నించింది. ‘ఇదేం ప్రశ్న.
త్వరలో వన్డే సిరీస్, ఛాంపియన్ ట్రోపీ జరగనున్నాయి. ప్రస్తుతం అవే నాకు ముఖ్యం. ఈ టైంలో నా భవిష్యత్తు గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం. ఏవో వార్తల గురించి మాట్లాడటానికి నేను లేను’ అని రోహిత్ శర్మ అన్నారు.
