ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ శర్మ ప్రసంగం
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు.
‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు.
గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.