ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

న్యూజిలాండ్ జట్టుతో బెంగుళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. దీనిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు..
రోహిత్ మాట్లాడుతూ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని ఊహించలేదని అన్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే రెండో ఇన్నింగ్సులో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషభ్, సర్ఫరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. ఇంగ్లండ్ జట్టుపై పుంజుకున్నట్లుగానే తిరిగి గాడిన పడుతామని హిట్ మ్యాన్ ఈసందర్బంగా ధీమా వ్యక్తం చేశారు.