తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..?

దుబాయి వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు.
పాక్ పేసర్ షహీన్ అఫ్రీది వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ ను ఆడలేక రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యారు. షహీన్ అఫ్రిదీ ఓ అద్భుతమైన బంతి వేశారు.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం 3 ఫోర్లు, ఒక సిక్సుతో హిట్ మ్యాన్ కాసేపు మెరుపులు మెరిపించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 12 ఓవర్లలో 80/1గా ఉంది. గిల్ 39*, కోహ్లి 18* పరుగులతో క్రీజులో ఉన్నారు
