దేవరగా రోహిత్..?
ఇంగ్లండ్ జట్టుతో రేపు గురువారం నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.
గత 14 వన్డేల్లో హిట్మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు.
అదే ఫామ్ కొనసాగించి దేవర మూవీ స్టిల్ లో రోహిత్ శర్మ ఫోటోను వైరల్ చేస్తూ పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో తెగ ఇబ్బంది పడిన రోహిత్ ఇంగ్లాండ్ జట్టుపై పరుగుల దాహం తీర్చుకుంటారని రోహిత్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు