మోదీకి రేవంత్ రెడ్డి లేఖ..!

 మోదీకి రేవంత్ రెడ్డి లేఖ..!

Revanth Reddy’s letter to Modi..!

Loading

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోదీ అపాయింట్ మెంట్ కోరారు.

తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధానమంత్రి ని కలుస్తాము..

ఈ రెండు బిల్లులపై శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతిపాదనపై అన్ని పక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు లేఖలో పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *