అనుభవంలేమితో రేవంత్ రెడ్డి నవ్వుల పాలు

 అనుభవంలేమితో రేవంత్ రెడ్డి నవ్వుల పాలు

Telangana CM Revanth Reddy

తెలంగాణ ఏర్పడ్డ తరువాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సాప్ నెట్ అనే సంస్థను టి-శాట్ అనే పేరుతో పునరుద్ధరణ చేసి ఆ సంస్థకు సీఈవోగా సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డిని నియమించి నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం “నిపుణ”, “విద్య” అని రెండు చానెళ్లు ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవి రెండు అటు విద్యార్థుల్లో, ఇటు నిరుద్యోగుల్లో చాలా ప్రజాదరణను పొందాయి.

అయితే ఇటీవల అధికారంలోకి  వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఈఓగా ఉన్న  శైలేష్ రెడ్డి స్థానంలో ఏ మాత్రం అనుభవం లేని బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి అనే జర్నలిస్టుకు  సీఈవోగా బాధ్యతలు అప్పగించింది. తనకు తెలియకుండానే తన శాఖలో ఒక సంస్థకు సీఈవో నియమించడంపై అప్పట్లో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొంత కినుక వహించారు. అప్పటి నుండి క్రమంగా సంస్థ దిగజారుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా రెండు చానెళ్లు మూతపడే స్థితికి వచ్చింది.

దీనికి కారణం కేయూ బ్యాండ్ జి-శాట్ 16 శాటిలైట్ సేవల కోసం ఎంఓయు పునరుద్ధరణ చేయనందుకు సిగ్నల్ ఆపేస్తామని ఇదే నెల జులై 5న నోటీసులను న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పంపింది. నోటీసులు పంపి పది రోజులు గడిచిన  ఐటి శాఖ నుండి ఎలాంటి స్పందన లేదు.. దీంతో నిన్న మంగళవారం  పూర్తిగా సిగ్నల్ నిలిపేసింది.దీంతో ఆయా శాఖల ఆన్ లైన్ సేవలన్నీ నిలిచిపోయాయి.

తాజాగా రేషన్ కార్డు ఉంటేనే రెండు లక్షల రుణమాఫీ అని విధివిధానాలను ఖరారు చేసి ఓ జీవో విడుదల చేసింది..దీంతో బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత..మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశం పెట్టి రుణమాఫీ చేయాలంటే కావాల్సింది రేషన్ కార్డు కాదు పాసుబుక్ అనే సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు..ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు అని చెప్పి అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు ఉంటేనే అని ప్లేట్ ఫిరాయిస్తున్నారు అని విరుచుకుపడ్డారు..దీంతో గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి రేషన్ కార్డు అవసరంలేదని క్లారిటీ ఇచ్చేదాక పరిస్థితి వచ్చింది. దీనిపై నెటిజన్లు అనుభవంలేని ముఖ్యమంత్రి..మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వుల పాలవుతుందని సెటైర్లు వేస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *