రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు.. బడ్జెట్ ప్రసంగంలో కనీసం పేరు ప్రస్తావన లేకపోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లే..
ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్రానికి కనీసం ఎనిమిది పైసలు కూడా ఇవ్వకపోవడం తీవ్ర వివక్ష చూపించడమే అని మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈరోజు జరిగే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు.
ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలి.. లేదా పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ పోడియం దగ్గరకెళ్ళి నిరసన గళం విన్పించాలని బీజేపీ ఎంపీలను కోరారు. విభజన చట్టంలో ముప్పై ఐదు హామీలున్నాయి.. వాటి గురించి కూడా ప్రస్తావించకపోవడం చాలా బాధగా ఉందని ఆయన అన్నారు.