మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Ministers.. MLA.. MPs.. who do not count CM Revanth Reddy..!
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న శుక్రవారం ఢిల్లీ పర్యటనలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడూతూ ‘క్యాబినెట్లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎవరి పేరు కూడా ఆధిష్టానానికి ప్రతిపాదించలేదు.
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాము. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన నాకు లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎన్నడూ ఉండవు’ అని అన్నారు.
