స్టేషన్ ఘన్ పూర్ పై రేవంత్ రెడ్డి వరాల జల్లు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
.రూ..200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు .. అంతేకాకుండా రూ..5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ.రూ.45. 5 కోట్లతో 100 పడకల ఆస్పత్రినిర్మాణ పనులను ప్రారంభించారు..
.రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్.రూ..148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, RS ఘన్పూర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులు.512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు.పలు రహదారుల విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.