బీజేపీలోకి రేవంత్ రెడ్డి – ఎంపీ క్లారిటీ..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా..?. అందుకే సీఎంగా ఉన్న ఆయన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీతో మనకు ఎలాంటి సమస్య లేదు.. వచ్చిన సమస్య అల్లా తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సమస్య అని వ్యాఖ్యానించారా..?. ఇప్పటివరకూ ముప్పై ఏడు సార్లు ఢిల్లీకెళ్లారు.
వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వపక్ష పార్టీ సీనియర్ నాయకులైన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుందా..?. అంటే తాజాగా బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలే నిజం అంటున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తామంటే సాధారంగా ఆహ్వానిస్తాము.. మేము ఎందుకు వద్దమంటాము అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సీఎం పదవి నుండి రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఆయన ఊరుకుంటడా..?.
నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో తాజాగా ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారనే వార్తలకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.