రేవంత్ రెడ్డికి నో చెప్పారు. మహేష్ గౌడ్ కి జై కొట్టారు..?
అనుముల రేవంత్ రెడ్డి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం ఆయనే. అలాంటి ఆయన ఢిల్లీకి వెళ్లి ఎన్ని సార్లు ఏఐసీసీ నేత.. లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ను కలవడానికి కాదు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటి నిన్న కాక మొన్న టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారో లేదో అప్పటి నుండి ఏడు ఎనిమిది సార్లు అధికారకంగా.. అనాధికారకంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. అపాయింట్మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ..
కానీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గత నాలుగు నెలలుగా ఎన్ని సార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదు. అఖరికి తన తండ్రి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాం ప్రారంభోత్సవానికి రమ్మన్న కానీ రాలేదు రాహుల్ గాంధీ. కానీ ఎల్లుండి నుండి మొదలు కానున్న బీసీ కులగణనకు రాహుల్ గాంధీ రానున్నారు.
అందులో భాగంగా ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. తాను పిలిస్తే రాలేదనే అక్కసుతో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటిముట్టని విధంగా ఉంటున్నారు.. మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కాంగ్రెస్ శ్రేణులతో కల్సి రేపటి ఏర్పాట్లను చూస్కుంటున్నారని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.