కుక్క తోక వంకరే అంటున్న రేవంత్ రెడ్డి…!

Revanth Reddy’s counter to Harish Rao..!
కుక్క తోక వంకరే అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఈ సామేతను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై జరిగిన చర్చలో దాదాపు రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాల గురించి కాకుండా సిద్ధాంతఫరంగా విమర్శలు చేయాలి.. రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని గౌతమ బుద్ధుడి లెవల్ లో ఉపోద్ఘాతం చేశారు.
అక్కడితో ఆగకుండా ఎవరైన సరే వ్యక్తిగత అంశాల గురించి విమర్శలు చేస్తే తొడ్కలు తీస్తా.. జైళ్ళలో పెడ్తా.. బట్టలు ఊడదీసి కొడతా అని వీరలెవల్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరవై నాలుగంటలు గడవకుండానే రేవంత్ రెడ్డి అదే వ్యక్తిగత అంశాల గురించి విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హారీష్ రావు కేసీఆర్ గురించి చేసిన జాతిపిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఆయన కౌంటరిస్తూ జాతిపిత అంటే ఎవరూ మహత్మాగాంధీజీ.. జయశంకర్ సారు. కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటివాళ్ళు జాతిపిత. కానీ లేస్తే ఫామ్ హౌజ్ లో తాగే కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు.. తాగుబోతుల పిత అవుతాడని హెద్దేవా చేశారు. కేసీఆర్ జాతిపిత కాడు పైన చెప్పిన వ్యక్తులందరూ జాతిపితలు అవుతారని అనడం వరకూ ఒకే ..
కానీ ఇలా వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడటం అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం దిగజారుడు కింద వస్తాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న ఏమో నిండు సభలో వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని హితబోధ చేసి తాజాగా ఇలా వ్యాఖ్యానించడం కుక్క తోక వంకరే అని రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
