రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్.!

మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ కేంద్రంలో బీఆర్ఎస్ రైతు భరోసా దీక్ష కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఓ యువతి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు చీప్ మినిస్టర్ అని తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.
ఇంకా ఆ యువతి మాట్లాడుతూ ” మేము బీఆర్ఎస్ పార్టీ ఫెయిడ్ బ్యాచ్ అని అబద్ధాలు చెబుతున్నారు.మేము బీఆర్ఎస్ ఫెయిడ్ బ్యాచ్ కాదు.. కేటీఆర్ అభిమానులం కాదు..మేము కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల.. రేవంత్ రెడ్డి చర్యల వల్ల రోడ్లపైకి వచ్చిన బాధితులం..
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతుంది. సీఎం క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మా బాధలు..మాకష్టాలు..కేటీఆర్ మాకు అండగా ఉండామంటే మా బాధలు చెప్పుకోవడానికి వచ్చామని తెలిపారు.
