అబద్ధానికి అంగీ లాగేస్తే రేవంత్ రెడ్డి..!

 అబద్ధానికి అంగీ లాగేస్తే రేవంత్ రెడ్డి..!

Loading

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత దుబాయికెళ్లాడు..దుబాయిలోని అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నాడు.. రెండు రోజులు పండుగ చేసుకున్నాక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వచ్చి నానాహాంగామ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ “అబద్దానికి అంగీ లాగేస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలా ఉంటాయి. సీఎం వ్యాఖ్యల అన్ని పచ్చి అబద్ధాలు.నా మిత్రుడు..సహాచర ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ కి అబుదాబికి వెళ్ళాను కానీ కొందరిలా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళలేదు.

నేను అబుదాబికి వెళ్ళింది ఫిబ్రవరి 21వ తేదీన అయితే ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22వ తేదీ, మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి ముఖ్యమంత్రి గారు.ప్రమాదం జరిగాక రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు ఇది వాస్తవం కాదా.

ప్రమాద స్థలానికి వెళ్ళడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట పోకుండా హైదరాబాద్ లో ఉన్నాడు ఇది వాస్తవం కాదా.ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను నిర్మాణాత్మకంగా బాధ్యతా యుతంగా వ్యవహరించి, ప్రమాద సహాయక చర్యలకు కావలసిన సమయమిచ్చిన తర్వాత ప్రమాద స్థలం దగ్గరికి పోయాను.రేవంత్ రెడ్డి తాను రాకపోగా వెళ్లిన హరీష్ రావు గారిని అడుగడుగున అడ్డుకొని, ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రమాద ఘటన స్థలం నుండే నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి.

ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడిచిన కార్మికులను కాపాడకపోగా, కనీసం వారి మృతదేహాలను బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వం.మానవత్వం మరిచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి పోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటాడని సవాల్ విసిరారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *