రేవంత్ రెడ్డి చీఫ్ మినిష్టర్ కాదు చీప్ మినిష్టర్
అసెంబ్లీ సమావేశాల్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ” నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు..
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “ఈరోజు అసెంబ్లీ చరిత్రలోనే చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తిడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని ఆయన ఉసిగొల్పుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు. చీప్ మినిస్టర్. యువత రేవంతకు తగిన సమాధానం చెప్పే టైమ్ త్వరలోనే వస్తుంది’ అని ఆయన వ్యాఖ్యా నించారు.