తెలుగు చిత్ర పరిశ్రమపై రేవంత్ రెడ్డి అసహానం
తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.. గతంలో సినీ ఇండస్ట్రీలోని కళాకారులను గుర్తించడానికి.. వారి ప్రతిభపాటవాలను ప్రశంసించడానికి నంది అవార్డుల పేరుతో అవార్డులతో సత్కరించే సంప్రదాయం ఉన్న సంగతి తెల్సిందే..
ఆ సంప్రదాయంలో భాగంగా నంది అవార్డుల స్థానంలో గద్ధర్ అవార్డుల పేరుతో ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.. అనుకున్నదే తడవుగా తమ తమ అభిప్రాయాలను.. సూచనలను చెప్పాల్సిందిగా సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను ,తెలుగు చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి కోరారు.
అయితే చెప్పి చాలా రోజులవుతున్న కానీ వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రముఖ తమిళ రచయిత.. ఉద్యమకారుడైన శివశంకరికి “విశ్వంభర డా.సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు..
ఆయన మాట్లాడుతూ ” టాలీవుడ్ లో చేసిన కృషికి విజయాలను గౌరవంగా గద్ధర్ అవార్డులను ప్రకటించాము.. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయమని పరిశ్రమని కోరాము.. కానీ ఇంతవరకు వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం” అని ఆయన వాపోయారు.