బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

 బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది.

సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను ఏపీకి మళ్లించడం గమనార్హం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గం ఎవరూ స్పందించలేదు..

ఈ పరిణామాలతో తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు విస్తుపోతున్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్‌ 54 [1] స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకున్నదని మండిపడుతున్నారు.ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అడుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్‌ (సీఎస్‌ఎస్‌) నిధులు రూ.454 కోట్లు ఏపీ ఖాతాలో పడ్డాయి. ఈ నిధులు తిరిగి ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం పదేండ్లుగా అడిగినా కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రూ.2,500 కోట్లు మళ్లించిన కేంద్రం.. ఇదే పద్ధతిలో సీఎస్‌ఎస్‌ నిధులను ఏపీ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఎందుకు ఇవ్వదని ప్రశ్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఈ అంశంపై నిలదీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *