మోదీకి రేవంత్ రెడ్డి సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాబై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.. రెండు లక్షల రుణమాఫీని ఇరవై రెండు లక్షల మంది రైతులకు పూర్తి చేశాము. ఇందుకుగాను మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాము.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించాము. ఐదోందలకు సిలిండర్ అందిస్తున్నాము. ఆరోగ్య శ్రీ పరిమితిని పదిలక్షలకు పెంచాము.. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాము. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న ఒక్క పథకాన్ని చూపెట్టాలని సవాల్ విసిరారు.