నేను విభిన్నం అంటున్న రేవంత్ రెడ్డి

 నేను విభిన్నం అంటున్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విభిన్నం అని నిరూపిస్తున్నారు. సహజంగా కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు అసలు పడదు.. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎప్పటికి ఉంటాయని రాజకీయ వర్గాల టాక్. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన కొన్ని పనుల వల్ల తాను కాంగ్రెస్ వాదానికి విభిన్నం అని నిరూపించినట్లైంది అని రాజకీయ వర్గాల అభిప్రాయం..

గద్దర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సాయుధ పోరటానికి… ఆ వాదానికి నిలువెత్తు రూపం.. నక్సలిజానికి కూడా మద్ధతు తెలిపారు. అప్పట్లో పోలీసుల కాల్పుల్లో ఓ బుల్లెట్ సైతం గద్దర్ శరీరంలో ఉంది. కొన్నాళ్ల పాటు ఆయన అజ్ఞాతవాసంలో కూడా ఉన్నారు. అయితే ఆయన పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు.

అంతేకాకుండా సాయుధ పోరటయోధురాలు.. అప్పటి నిజాం దోరలపై తిరగబడిన చాకలి ఐలమ్మ పేరును కోఠి విమెన్స్ విశ్వవిద్యాలయానికి పెట్టారు.. మరోవైపు సురవరం ప్రతాపరెడ్డి పేరును పొట్టి శ్రీరాముల తెలుగు యూనివర్సిటీకి పెట్టారు.. ముఖ్యమంత్రి చేపట్టిన ఈ చర్యలతో కనుమరుగవుతున్న కమ్యూనిస్ట్ యోధులను తెలంగాణ సమాజం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తున్నారు.. అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు విభిన్నంగా ఉన్నారని రాజకీయ వర్గాల టాక్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *