బాబుకు రేవంత్ రెడ్డి గురు దక్షిణ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్న రాజకీయ చదరంగంలో గురు శిష్యులు అని అందరికి తెల్సిందే.. ఎంతగా తాను కేవలం అనుచరుడ్నే.. నాకు బాబు గురువు కాదు అని ఎన్ని కవర్ డ్రైవ్స్ చేసిన కానీ అదే నిజం పలుమార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గత ఎనిమిది నెలలుగా తెలంగాణ లో చేస్తున్న కొన్ని పనులను బట్టి ఆర్ధమవుతుందని రాజకీయ వర్గాల టాక్.
నిన్న మొన్నటి వరకు హైడ్రాతో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసి బాబు డ్రీమ్ ప్రాజెక్టు అమరావతి రాజధానిలో రియల్ బూమ్ పెరగడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ గురుకుల విద్యాలయాలు నాశనం కావడానికి విద్యార్థులకు నాణ్యమైన ఆహరం అందించడం లేదు.. బాబు మంత్రివర్గంలో సభ్యుడు. బాబుకు అత్యంత ప్రియమైన శిష్యుడు అయిన ఓ నేతకు చెందిన విద్యాసంస్థలు తెలంగాణలో బలోపేతం కావడానికి ఈ పనులు అని కూడా విమర్శ.
తాజాగా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పాల సేకరణ సంస్థ అయిన విజయ డెయిరీను పండబెట్టి( రేవంత్ రెడ్డి మాటల్లో) బాబుకు సంబంధించిన హేరిటేజ్ సంస్థని పైకి లేపడానికి ఆ సంస్థ నష్టాల్లో ఉందని చెబుతున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నారు. ఆ వాదనలకు బలం చేకూరే విధంగా హేరిటెజ్ షామీర్ పేటలో రూ.204కోట్లతో ఓ ప్రాజెక్టుకు తెర తీసిందని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైన కానీ గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది.. కొనుగోళ్లు తగ్గాయి.. గురుకులాలతో పాటు ఆసుపత్రుల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయని వార్తలను మనం రోజూ చూస్తూనే ఉన్నాము.