రేవంత్ రెడ్డికి సీఎం పదవీ గండం..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలలుగా ఇటు ఓట్లేసిన తెలంగాణ ప్రజల మన్నలను.. అటు ఢిల్లీ పార్టీ అధినాయకత్వాన్ని సంతృప్తి పరచలేదా..?. అందుకే సీఎంగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారా..?. ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా. కులాల కుంపటి. ఎమ్మెల్యేల నిరసనల జ్వాల లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా..?. అంటే అవుననే అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ .
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న దీపా మున్సీ దాస్ ను తప్పించి ఎలాంటి అవినీతి మరకలేని.. “సౌ టకా టంచ్ మాల్” (100% స్వచ్ఛమైన పదార్థం లేదా పూర్తిగా మచ్చలేనిది)అని పేరు ఉన్న .. రాహుల్ గాంధీ టీమ్ లో ఒకరైన మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ను నియమించడం వెనక ఉన్న అసలు కారణం ఇదే అని తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జూనియర్ సీనియర్ పార్టీ నేతలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అనే బేధాభిప్రాయం లేకుండా తీవ్ర వ్యతిరేకత ఉండటం.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన ఓ మంత్రి సైతం నేనే పార్టీలో.. ప్రభుత్వంలో రెండో నంబర్ అని ప్రకటించుకోవడం . మహబూబ్ నగర్ కు చెందిన ఓ మంత్రి నేతృత్వంలో ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఏకంగా సదరు మంత్రిపై పిర్యాదులతో పాటు ఆధారాలను తీసుకెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గేకి అందజేయడం లాంటి పరిణామాలను గమనించిన ఆధిష్టానం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తీరుతో ఇటు పార్టీలో.. అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు ఆర్ధమవుతుంది.
ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్సీ రేవంత్ టీం కు సపోర్టుగా ఉంటున్నారు అనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను నిజం చేసినట్లు ఇరువురి తీరు అలాగే ఉంది. దీంతో మున్ముందు పార్టీపై.. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకునే క్రమంలో ముఖ్యమంత్రిని సైతం తప్పిస్తామనే సంకేతాలు మీనాక్షి నటరాజన్ రూపంలో ఆధిష్టానం పంపింది. తీరు మారకపోతే సీఎం పోస్టుకే గండి పడుతుందని విశ్లేషకుల టాక్.
